నాగార్జున సాగర్ లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు పెరుగుతున్నాయి. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు నిండు కుండలా ఉండటం, పైన ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిపోవటంతో వచ్చిన నీరు వచ్చినట్లు శ్రీశైలంకు చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు వస్తున్న వరదకు అనుగుణంగా సాగర్ కు అధికారులు నీరును విడుదల చేస్తున్నారు.

కృష్ణాతో పాటు తుంగభద్రలో వరద కొనసాగుతుంది. అయితే కృష్ణాలో వరద ఒక్కసారిగా పెరగటం, ఒక్కసారిగా తగ్గుతున్నట్లు అధికారులంటున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590అడుగులు కాగా ప్రస్తుతం 563.10అడుగుల నీరుంది. ఇన్ ఫ్లో 38,140క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 8422క్యూసెక్కులు. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సాగర్ లో 239.65టీఎంసీలు ఉంది.
సాగర్ లో నీటిమట్టం పెరుగుతున్నందున సాగర్ పరిధిలోని ఆయకట్టు ప్రాంత రైతులు వరి నాట్లు వేసేందుకు అధికారులు దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.