ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో 8 క్రస్ట్ గేట్లను 10 అడుగులు ఎత్తి దిగువకు 2.23 లక్షల క్యూసెక్కుల వరద నీటిని వదిలేస్తున్నారు.
శ్రీశైలం: జూరాల నుంచి 2.38 లక్షల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 67 వేల క్యూసెక్కుల వరద శ్రీశైలం వచ్చి చేరుతోంది. కుడిగట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా 67 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. కల్వకుర్తికి 2.4 వేల క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2 వేల క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 28 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులు. పూర్తి స్థాయి నిల్వ సామర్ధ్యం 215.81 టి.ఎం.సి.లు. ప్రస్తుత నీటి నిల్వ 214.36 టి.ఎం.సీ.లు.
నాగార్జునసాగర్ 24 గేట్లు ఎత్తారు. దిగువకు 3.5 లక్షల క్యూసెక్కులు వదులు తున్నారు. సాగర్ డ్యామ్ పూరి నీటి మట్టం 590 అడుగులు ఉంది. పూర్తి నిల్వ సామర్ధ్యం 312 టి.ఎం.సి.లు మెయింటైన్ చేస్తున్నారు.