విశాఖ: అన్ని నదులూ పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు వంశధార వంతు. ఉత్తరాంధ్రలో ప్రధానమైన ‘వంశధార’కు వరద ఉధృతి పెరుగుతోంది. గొట్టా బ్యారేజ్ దగ్గర ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వంశధార నది ఇన్ ఫ్లో 50,177 క్యూసెక్కులు ఉంది. ఔట్ ఫ్లో 51,565 క్యూసెక్కులుగా ఉంది. విపత్తుల నిర్వహణ శాఖ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ చెబుతోంది.