అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ మళ్లీ గడగడలాడిస్తోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రముఖ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అంచనా ప్రకారం అమెరికాలో కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 12 మిలియన్లు దాటిపోయింది. యూనివర్సిటీ రియల్ టైమ్ ట్రాకర్‌లోని సమాచారం ప్రకారం గత ఆరు రోజుల వ్యవధిలోనే ఏకంగా 10 లక్షల మంది కరోనా బారిన పడ్డట్లు తెలిపింది. అంటే ప్రతి రోజు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
ఇక అమెరికాలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,20,19,960కు చేరగా, 2,55,414 మంది కరోనా వైరస్ వల్ల మృతి చెందారు. దీంతో అమెరికాలోని పలు ప్రాంతాల్లో ప్రజలపై ఆంక్షలు మొదలవుతున్నాయి. అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఇంట్లో నుండి భయటకు రావొద్దని అధికారులు కోరుతున్నారు. న్యూయార్క్ లో స్కూల్స్ మళ్లీ మూతపడగా, కాలిఫోర్నియాలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నారు. అమెరికాలో మూడో అతిపెద్ద నగరమైన చికాగోలో సోమవారం నుంచి స్టే హోం ఆదేశాలు అమల్లోకి రానున్నాయి.
ఇప్పటికే అమెరికా ఎఫ్డీఏకు ఫైజర్ కంపెనీ, మోడెర్నా కంపెనీలు అత్యవసర వ్యాక్సినేషన్ కు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసిన నేపథ్యంలో అమెరికాలో పరిస్థితి చేయిదాటక ముందే గ్రీన్ సిగ్నల్ రానుందన్న ప్రచారం ఊపందుకుంది.