తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం రాత్రి తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే మరో రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడు నుంచి ఛత్తీస్ గఢ్ వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఆదివారం, సోమవారం వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఆదివారం కావడంతో జనాలంతా అత్యవసర పనులుంటే తప్ప బయటకు వెళ్లడంలేదు. చలిగాలులు కూడా వీస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.