ఏపీలో ఇవాళ, రేపు వర్షాలుపడతాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఈశాన్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని… దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే వీలుందని అంచనా వేసింది.
అల్పపీడన ప్రభావంతో ఇవాళ, రేపు.. రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ సూచించింది