హైదరాబాద్ వాసులను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. సాయంత్రం 6 గంటల నుండి 8గంటల వరకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ 2గంటల పాటు కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని, నాలాల చుట్టు ప్రక్కల ప్రాంత ప్రజలు మరీ అప్రమత్తంగా ఉండాలని కోరింది.
దీంతో నగర వాసులను ఈ రెండు గంటల పాటు ఇళ్లలోనే ఉండాలని జీహెచ్ఎంసీ కోరింది. అత్యవసరం అయితే తప్పా జనం ఇళ్ల నుండి బయటకు రావొద్దని సూచించింది. ఏదైనా అత్యవసరం అయితే 040- 29555500నెంబర్ కు సమాచారం ఇవ్వాలని సూచించింది.