బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణలో మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడన ప్రాంతం నుండి ఒడిశా మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని… ఫలితంగా బుధ, గురువారాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.
మంగళవారం కూడా ఈ ద్రోణీ వల్లే అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. నల్గొండ, సిద్దిపేట, ఖమ్మంలలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా మెదక్ జిల్లాలోని చిట్కులలో 14.1సె.మీ వర్షం కురిసింది.