హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాన పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.
చంపాపేట్, సైదాబాద్, దిల్ సుఖ్ నగర్, పాతబస్తీ, గోల్కొండ, ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హయత్ నగర్, అనాజ్ పూర్, పెద్దఅంబర్ పేట, అబ్దుల్లాపూర్ మెట్, అమీర్ పేట్, మైత్రివనంలో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఇటు కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. రోడ్లు జలమయం కాగా.. మ్యాన్ హొల్స్ పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. GHMC, DRF, అత్యవసర విభాగం రంగంలోకి దిగాయి. భారీ వర్షంతో ఆందోళనలో ఉన్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం జంగమ్మ డివిజన్ లక్ష్మినగర్ లో చిన్నపాటి వర్షానికే మూడు అడుగుల మేర నీరు చేరింది.