ఢిల్లీని వరుణుడు వణికిస్తున్నాడు. కేవలం 3 గంటల్లోనే 73 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కాగా.. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. సష్దర్ గంజ్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వాన పడింది. ప్రగతి మైదాన్ ప్రాంతంలో రోడ్లు జలపాతాలను తలపిస్తున్నాయి.
రోడ్లన్నీ నీళ్లతో నిండిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ లు అవుతున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. అలాగే ఈనెల 23 నుంచి 26 వరకు గ్రీన్ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణశాఖ. భారీ వర్షాలు ఇంకా కొనసాగుతాయని హెచ్చరించింది. ఢిల్లీతోపాటు హర్యానా, ఉత్తరప్రదేశ్ లో కూడా వానలు పడతాయని తెలిపింది.