వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. సాయంత్రం నుంచి హైదరాబాద్ ను ముసురు కమ్మేసింది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్‌పేట్, కాచిగూడ, గోల్నాక, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, పంజాగుట్ట, అమీర్ పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్ రోడ్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, దిల్‌సుఖ్ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, కూకట్ పల్లి, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్, ప్రగతి నగర్, నిజాంపేట, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, పాతబస్తీ, చంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, బార్కస్, బహదూర్ పూరాలో భారీ వర్షం కురిసింది.
ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో సాయం కోసం 040-29555500కు సంప్రదించాలని అధికారులు కోరారు. భారీ వర్షం కారణంగా ముసారాంబాగ్ బ్రిడ్జి మీదుగా మూసీ వరదనీరు ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్తగా అధికారులు రాకపోకలు నిలిపివేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. వందలాది వాహనాలు ఎక్కడికక్కడే రోడ్లపైనే నిలిచిపోయాయి. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులను మేయర్ విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. సహాయక చర్యల కోసం అత్యవసర బృందాలను రంగంలోకి దించారు