ఢిల్లీని వరుణుడు వదలడం లేదు. బుధవారం రికార్డ్ స్థాయిలో వర్షం పడగా… గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. వరద నీరు రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉదయం 6.30 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం అంతకంతకూ పెరిగింది. కుంభవృష్టి వానతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనజీవనం అస్తవ్యస్థంగా తయారైంది.
ఢిల్లీలో 19 సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయిలో అత్యధిక వర్షాపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇవాళ అంతా భారీ వర్షాలు పడతాయని తెలిపారు. బుధవారం ఢిల్లీలో 112.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.