భారీ వర్షాలతో ముంబై వణికిపోతోంది. ఎడతెరపిలేని వానలతో అనేక ప్రాంతాలు నీటి మునిగాయి. ఎక్కడికక్కడ వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించిపోయింది. దీంతో మహానగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడాలా, చెంబూర్, హింద్మాత, పరేల్ సహా అనేక ప్రాంతాలు జలమయమైపోయాయి. భారీ వర్షాలకు కొన్ని చోట్ల పాత భవనాలు కుప్పకూలిపోతున్నాయి. దాదార్‌లో ఓ ఇళ్లు చూస్తుండగానే నేలమట్టమైంది.
#WATCH Mumbai: A portion of a house collapsed in Dadar today, following heavy rainfall in the city. #Maharashtra pic.twitter.com/csaWccHS3v
— ANI (@ANI) August 6, 2020
మరో రెండు రోజుల పాటు ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో.. వాతావారణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని తెలిపింది.