తిరుమలలో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు, రోడ్డులు నిండిపోయాయి. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మొదటి, రెండవ ఘాట్ రోడ్డులలో ప్రయాణించే ప్రయాణికుల అప్రమత్తంగా వ్యవహరించాలని ఇప్పటికే టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.
అలాగే ఇళ్లలో ఉండే వారు బయటకు వచ్చే పరిస్థితి లేకపోవటంతో జనజీవనం స్తంభించిపోయింది. రాకపోకలు ఆగిపోయాయి. తిరుపతి బస్టాండు లో సైతం నీరు నిలిచిపోయింది. దీంతో అక్కడ ఉన్న ప్రయాణీకులు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. మరోవైపు ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.