భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్ ను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ధర్మశాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. నగరంలో ఒక్కరోజే 300 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుంభవృష్టికి కొండల మీది నుంచి వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
కొండలపైనుంచి వస్తున్న వరద నీటి ధాటికి ఇళ్లు, కార్లు కొట్టుకుపోయాయి. ఎటుచూసినా బురదమయంగా మారింది. సిమ్లా జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. చాలామంది పర్యటకులు ధర్మశాలలోని కొన్ని ప్రాంతాల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
వరద ప్రవాహానికి సంబంధించిన వీడియోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఇళ్లు, కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోతున్నాయి. తమను కాపాడాలంటూ చాలామంది సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. ఇక మాన్హి నది ఉప్పొంగడంతో వరదలు మరింత పోటెత్తాయి.