బంగాళాఖాతంలో అల్పపీడనం.. రుతుపవనాల కదలికతో ఇవాళ, రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతం నుంచి నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉంది. వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదలొచ్చని అంచనా వేసింది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసింది.
ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసిన జిల్లాలు (అతి భారీ వర్షాలు)
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నల్గొండ, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, ములుగు, సిద్దిపేట, మెదక్.
ఎల్లో హెచ్చరిక జారీ చేసిన జిల్లాలు (భారీ వర్షాలు)
సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్.