కొత్త వ్యవసాయ చట్టాలపై ఉద్యమం చేస్తున్న రైతన్నలు చక్కా జామ్ కు పిలుపునిచ్చారు. అంటే రోడ్ల దిగ్భందనం. మద్యాహ్నాం 12గంటలకు ఇది ప్రారంభం కానుంది. అయితే, రిపబ్లిక్ డే రోజు జరిగిన హింస నేపథ్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.
చక్కా జామ్ ను నిలువరించటంతో పాటు రైతన్నలు ఢిల్లీలోకి చొచ్చుకొస్తారన్న అభిప్రాయంతో ఢిల్లీ పోలీసులు వారిని నిలువరించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. రోడ్లపై మేకులు ఏర్పాటు చేసి… ఎవరూ రాకుండా కంచె వేశారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. మేకిన్ ఇండియా ఏమో కానీ మేకుల ఇండియా తయారు చేశారుగా అంటూ నిట్టూర్చటంతో సర్కార్ వెనక్కి తగ్గి వాటిని తొలిగించింది.
చక్కా జామ్ ను విజయవంతం చేసేందుకు రైతులు మూకుమ్మడిగా సమాయత్తం కాగా, పోలీసులు దాదాపు 50వేల మందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. మతపరమైన సంస్థలు, ఎర్రకోట, పార్లమెంట్ వైపు రైతులు రాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. తమ చక్కా జామ్ 12గంటల నుండి మద్యాహ్నాం 3గంటల వరకు ఉంటుందని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.