ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచుపడుతోంది. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్‌నాథ్, గంగోత్రి ఆలయాలను మంచు దుప్పటి కప్పేసింది.
ఆలయ పరిసరాల్లో ఎటు చూసినా మంచు పరుచుకుని ఉంది. చమోలీ జిల్లాలలోని పలు ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. కేదారీనాథ్ ప్రాంతంలో మైనస్ 14 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మూడు ఫీట్ల వరకు మంచుతో పరుచుకున్నట్టు అధికారులు తెలిపారు.
జోషీమఠ్ తదితర ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. ఇండ్లు, రోడ్లను పూర్తిగా మంచుకప్పేసింది.
సిమ్లా, మనాలీలోని, కేదారీనాథ్ లోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ తెలుపు రంగులోకి మారాయి. రహదారులపై ఎక్కడ చూసినా మంచు భారీగా పేరుకుపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.