భీష్మ సినిమా విడుదలకు మరో మూడు రోజులే మిగిలి ఉండటంతో సినిమాపై అంచనాలను పెరిగిపోతున్నాయి. నితిన్, రష్మీక మందన్న జంటగా వస్తున్న భీష్మ ట్రైలర్ ఇప్పటికే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో నితిన్ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో రష్మీకతో పాటు మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కుమారి 21F ఫేం హెబ్బా పటేల్ క్రూషియల్ రోల్‌లో భీష్మలో కనిపించబోతుందట. ఆమె పాత్ర చిన్నదే అయినా… ప్రాధాన్యత ఉన్న పాత్ర అని, నితిన్‌తో రొమాన్స్ చేస్తుందని ఇండస్ట్రీ టాక్. ఓ రకంగా ఇదో సర్ఫ్రైజ్ అనుకోవచ్చు. అయితే ఇప్పటికే అవకాశాలు లేక సినిమాల కోసం చూస్తున్న హెబ్బాకు భీష్మ కీలకమైన సినిమాగా చెప్పుకోవచ్చు.
ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.