టీవీ స్టార్ హీనా ఖాన్ తన అందాలతో యువతకు పిచ్చెక్కిస్తోంది. కేన్స్ ఫెస్టివల్ లోని ఫ్రెంచ్ రివెరా తీరంలో బోల్డ్ డ్రెస్సింగ్ లో తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుకు కిక్కిస్తోంది ఈ అందాల బ్యూటీ. తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో స్టన్నింగ్ ఫోటోలను పోస్ట్ చేసింది ఈ క్యూటీ. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లైట్ వంకాయ కలర్ డ్రెస్ లో రెడ్ కార్పెట్ పై మెరిసింది హీనా. కిల్లింగ్ లుక్స్ తో తెగ అట్రాక్ట్ చేసింది.
అంతకుముందు రోజు ఇటాలియన్ బ్రాండ్ ఫొవేరియా కంపెనీ డిజైన్ చేసిన బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్సులో మెరిసింది. హిందీ టీవీ ఇండస్ట్రీలో హీనా ఖాన్ ఓ పాపులర్ నటి. అంతేకాకుండా.. క్షమించండి.. నేను చేసిన తప్పుకు అంటూ తన ఫోటోలకు ఓ ట్యాగ్‌లైన్ కూడా యాడ్ చేసింది.
అయితే.. కేన్స్‌లో ఓపెన్ అయిన ఇండియన్ పెవిలియన్ కు హీనాను ఆహ్వానించలేదని తెలుస్తోంది. దీని పట్ల ఆమె అసహనం వ్యక్తం చేసిందట. ఇండియన్ పెవిలియన్ కేవలం బాలీవుడ్ నటులకేనా అంటూ ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విమర్శించింది. ఐశ్వర్యరాయ్, తమన్నా, పూజా హెగ్డేలతో ఇండియన్ పెవిలియన్ కళకళలాడింది.
హిందీ టీవీ ఇండస్ట్రీలో హీనా ఖాన్ ఓ పాపులర్ నటి. యే రిస్తా క్యా కెహలాతా హైలో ఆమె అక్షర పాత్ర పోషించింది. కసౌతీ జిందగీ క్యా రెండవ భాగంలోనూ ఆమె నటించింది. దాంట్లో కొమలిక పాత్రను పోషించింది. ఖత్రోంకీ ఖిలాడీ సీజన్ 8 రియాల్టీ షోలో నటించన హీనా.. నాగిని 5 టీవీ షోలోనూ యాక్ట్ చేసింది.