యూఎస్ లోని అట్లాంటిక్ మహాసముద్రంలో హెలికాప్టర్ కూలిపోయింది. మియామి బీచ్ కు సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను జాక్సన్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు.
‘ శనివారం మధ్యాహ్నం 1.10 గంటలకు అట్లాంటిక్ సముద్రంలో హెలికాప్టర్ కూలినట్టు మియామీ పోలీసులకు సమాచారం అందింది.
మియామీ బీచ్ ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరిని మెమోరియల్ హాస్పిటల్ కు తరలించారు” అని ఆంగ్ల చానెల్ సీఎన్ఎన్ పేర్కొంది