బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాతో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఆది పురుష్ సినిమాలు ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు.
మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో మరో సీనియర్ నటి కీలకపాత్రలో నటించబోతుందట. ఆమె మరెవరో కాదు హేమమాలిని. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారికంగా చిత్ర యూనిట్ స్పందించాల్సిందే.