తన రాజకీయ ప్రత్యర్థి, రాష్ట్రీయ జనతాదళ్ నేత జయంత్ చౌదరీకి బీజేపీ ఎంపీ హేమా మాలిని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హేమా మాలిని కావడం అంటే అంత సులువైన పనికాదని ఆమె అన్నారు. ఎన్నో కష్టాలకు ఓర్చి జీవితంలో పోరాడితేనే తనకు డ్రీమ్ గర్ల్ పేరు వచ్చిందని తెలిపారు. అలాంటింది జయంత్ చౌదరీ హేమామాలినిగా ఎలా మారతారు. అదంత సులువు కాదు. అంతటి కష్టమైన పనిని ఆయన చేయలేరు. అందుకే ఆయన చెప్పింది నిజమే అని కౌంటర్ ఇచ్చారు.
కాగా బీజేపీలో చేరాలంటూ తమ పార్టీ నేత ఒకరికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారని ఆర్ ఎల్ డీ నేత జయంత్ చౌదరి ఇటీవల తెలిపారు. ఇందుకోసం తమ పార్టీ నేతకు అమిత్ షా ఎంపీ పదవి ఆశ చూపారని జయంత్ చౌదరి ఆరోపించారు. దీనిని గురించి ఓ బహిరంగ సభలో వివరిస్తూ తాను హేమామాలినిగా కావాలని అనుకోవడం లేదని అన్నారు.
‘ మా పార్టీ నేత యోగెశ్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి పోన్ కాల్ వచ్చింది. యోగేశ్ జీ మీరు బీజేపీ పార్టీలో చేరండి. అలా చేస్తే మిమ్మల్ని నా హేమామాలిని(లోక్ సభ ఎంపీ)గా చేస్తాను అని అమిత్ షా అన్నారు ” అని వ్యాఖ్యలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే.