నటసార్వభౌముడు, నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు నందమూరి బాలకృష్ణ. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా నిలదొక్కుకున్నారు. ఫైట్ చేయాలన్నా… డైలాగ్ చెప్పాలన్నా నందమూరి బాలకృష్ణ తరువాతే ఎవరైనా అనే విధంగా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో కూడా నటించి కోట్లాదిమంది అభిమానుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు.
అయితే వందకు పైగా సినిమాలు చేసిన బాలయ్య తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను వదులుకున్నాడు. మొదటిగా మాట్లాడుకోవాల్సిన చిత్రం చంటి. వెంకటేష్ హీరోగా మీనా హీరోయిన్ గా 1991లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. కాగా ఈ కథను మొదట డైరెక్టర్, నందమూరి బాలకృష్ణకు చెప్పారట. కానీ ఆయన నో చెప్పడంతో వెంకటేష్ చేశాడు.
మరొక చిత్రం జానకి రాముడు… అక్కినేని నాగార్జున హీరోగా విజయశాంతి హీరోయిన్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా కథ కూడా బాలయ్య దగ్గరకే మొదట చేరిందట. ఆయన నో చెప్పాడం తో నాగార్జున దగ్గరికి వెళ్ళింది.
మూడో చిత్రం సింహరాశి. ఈ సినిమా కథను కూడా డైరెక్టర్ సముద్ర మొదట బాలయ్యకు చెప్పారట. కానీ కుదరకపోవడంతో రాజశేఖర్ తో చేశాడు. ఈ చిత్రం పెద్ద హిట్ సాధించింది.
నాల్గవ చిత్రం సూర్యవంశం… వెంకటేష్ హీరోగా మీనా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ కథ కూడా మొదట బాలయ్య దగ్గరకు వెళ్లగా పెద్దన్నయ్య కథను పోలి ఉండటంతో నో చెప్పాడట.
ఇక 5వ చిత్రం శివరామరాజు… 2002లో జగపతిబాబు హీరోగా వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో హరికృష్ణ ఒక కీలక పాత్రల్లో నటించారు. అయితే మొదట బాలయ్యకు ఆ పాత్రలో నటించే అవకాశం వచ్చిందట. ఆయన వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంవల్ల రిజెక్ట్ చేశాడట.
6వ చిత్రం అన్నవరం… పవన్ కళ్యాణ్ తీసిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. కానీ ఈ కథ కూడా మొదట బాలయ్య దగ్గరికి చేరిందట. కానీ నో చెప్పడంతో పవన్ కు చేరిందట.
రమాప్రభ,ఎన్టీఆర్ లతో రాజేంద్ర ప్రసాద్ కు ఉన్న రిలేషన్ ఇదే !!
7వ చిత్రం బాడీగార్డ్… గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వెంకటేష్ త్రిష కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం 2012లో విడుదలైంది. ఇది బాలీవుడ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఈ సినిమాను ఓ నిర్మాత బాలయ్యతో చేయాలని అనుకున్నారట. కానీ ఈ లోపు ఆ రీమేక్ హక్కులను బెల్లంకొండ సురేష్ కొనుగోలు చేయడంతో బాలయ్య నుండి ఆ చిత్రం మిస్ అయింది.
8 వ చిత్రం సైరా నరసింహారెడ్డి… మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. కానీ నిజానికి పదేళ్ల క్రితమే బాలయ్య ఈ సినిమా చేయాల్సి ఉందట. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు.
హీరో ఆర్యన్ రాజేష్ భార్య సుభాషిణి ఎవరో తెలుసా ?
ఇక 9 వ చిత్రం సింహాద్రి… రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ సినిమా కథ కూడా బాల్య దగ్గరకు చేరిందట. కానీ ఆయన నో చెప్పడంతో ఎన్టీఆర్ చేశాడు.
ఇక ఆఖరుగా 10వ చిత్రం క్రాక్. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి సక్సెస్ ను సాధించింది. మొదట గోపీచంద్ బాలయ్య తో ఈ సినిమా చేయాలని అనుకున్నారట. కానీ కథ అంతగా నచ్చకపోవడం తో నో చెప్పారట. కానీ రవితేజ మాత్రం ఈ సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు.