ఇండస్ట్రీలో హీరోలు వారి దగ్గరకు వచ్చిన కథలను చాలా వరకూ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అందులో ఒకటి, రెండూ మాత్రమే సెలెక్ట్ చేసి సినిమాలు చేస్తూ ఉంటారు. అలాగే మరికొన్ని చిత్రాలు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. కాగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో 4 సినిమాల వరకు మధ్యలోనే ఆగిపోయాయి.
మొదటి చిత్రం సత్యాగ్రహి, టైటిల్ ఎనౌన్స్ మెంట్ చేయగానే పవన్ ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాకు పవన్ స్వీయ దర్శకత్వం చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ జానీ ఫెయిల్ కావటంతో ఆ ఇంపాక్ట్ ఈ సినిమాపై పడింది. దీంతో ఈ సినిమా ఆగిపోయింది. అయితే ఈ టైటిల్ మాత్రం ఇంకా పవన్ పేరును రిజిస్టర్ అయి ఉంది.
రాజశేఖర్ కూతురి మెడికల్ కోసం చిరు ఇంటికి వెళితే ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా ?
మరో సినిమా దేశి, పేట్రియాటిజం జనాల్లో పవన్ ఈ సినిమా తీయాలనుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయినప్పటికీ సినిమా మాత్రం స్టార్ట్ కాలేదు.
మూడవ చిత్రం ప్రిన్స్ ఆఫ్ పీస్, సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో ఏసు క్రీస్తు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాలని 2010లో స్టార్ట్ చేశారు. జెరూసలెంలో ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. కానీ ఉన్న ఫలంగా ఈ షూటింగ్ ఆగిపోయింది.
పవన్ కళ్యాణ్ మొదటి సినిమాకి ఎంత తీసుకున్నాడంటే..?
ఇక నాలుగవ చిత్రం కోబలి. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా ప్లాన్ చేశారు. కానీ స్క్రిప్టు జరుగుతున్న సమయంలోనే ఈ సినిమా ఆగిపోయింది.