టాలీవుడ్ లో చాలా మంది హీరోలు తమ వద్దకు వచ్చిన కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే అలా చేసిన సినిమాలు ఒకసారి సూపర్ డూపర్ హిట్ అవుతాయి. మరికొన్ని సార్లు ఫ్లాప్ అవుతాయి. ఫ్లాప్ అయినప్పుడు తప్పించుకున్నాం అనుకునే వారు ఉంటారు. హిట్ వచ్చినపుడు మిస్ అయ్యాము అనుకొని బాధ పడిన వారు కూడా ఉంటారు. ఇక టాలీవుడ్ లో హిట్ సినిమాలను వదులుకున్న ఎన్టీఆర్, మహేష్ బాబుల లిస్టు చూసుకుంటే కాస్త పెద్దది గానే ఉంటుంది.
మొదటిగా సింహాద్రి, రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కథను మొదట ప్రభాస్ రాజమౌళి ప్రభాస్ కు వినిపించాడట కానీ ఆయన నో చెప్పటంతో ఎన్టీఆర్ తో చేసాడట. మరొక మూవీ ఆర్య, 2004లో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని మొదట ప్రభాస్ ఎన్టీఆర్ కు వినిపించాడట సుకుమార్. కానీ వారు నో చెప్పటంతో అల్లు అర్జున్ తో చేసాడట.
ALSO READ : అఖండ ను రిజెక్ట్ చేసిన నలుగురు హీరోయిన్స్ వీరే !
మరో సినిమా ఊపిరి… వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీ హీరోలుగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా కోసం మొదట ఎన్టీఆర్ ను సంప్రదించారట. ఆయన నో చెప్పటంతో కార్తీని తీసుకున్నారట. అలాగే భద్ర, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రవితేజ హీరోగా 2005లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట ఈ సినిమా కథను ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకు చెప్పాడట వారు నో చెప్పటంతో రవితేజతో తెరకెక్కించాడు.
ఇంక మరో సినిమా కిక్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా 2009లోఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కథను కూడా మొదట జూనియర్ ఎన్టీఆర్ కు సురేందర్ రెడ్డి వినిపించాడట. ఆయన నో చెప్పడంతో రవితేజ తో తెరకెక్కించారు. రాజా ది గ్రేట్, అనిల్ రావిపూడి ఈ సినిమాని మొదట ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నారట. కానీ ఆయన నో చెప్పడంతో రవితేజతో తెరకెక్కించి మంచి హిట్ ని అందుకున్నాడు.
మరో సినిమా దిల్… నితిన్ హీరో వి.వి.వినాయక్ దర్శకత్వంలో 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కథను మొదట ఎన్టీఆర్ కు వినిపించారట వివి వినాయక్. కానీ ఆయన నో చెప్పడంతో నితిన్ తో చేశారట. ఇక శ్రీమంతుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కథను మొదట జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పాడట. ఆయన నో చెప్పడంతో మహేష్ తో తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది.
ALSO READ : కాజల్ తో పాటు గెటప్ శ్రీనును ఆచార్య నుంచి అందుకే తీసేసారా ?
ఏ మాయ చేసావే, నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కథను మొదట మహేష్ తో చేయాలని అనుకున్నారట మేకర్స్. ఆయన నో చెప్పడంతో నాగచైతన్య తో తీశారు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా… ఈ సినిమాలో వరుణ్ హీరోగా నటించాడు. కానీ మొదట ఈ కథను మహేష్ కు చెప్పాడట శేఖర్. ఆయన నో చెప్పడంతో వరుణ్ తో తెరకెక్కించాడు. ఇలా ఎన్టీఆర్ మహేష్ బాబులు చాలా వరకూ హిట్ సినిమాలను వదులుకున్నారు.