విమాన ప్రయాణం సమయంలో మనకు వచ్చే డౌట్స్ కొన్ని ఉంటాయి. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేయాలి, విమానం బరువు ఎక్కువ ఉన్నా సరే గాలిలో ఎందుకు అంత ఎత్తు ఎగిరినా కింద పడకుండా ఏం ఆపుతుంది అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఇక మరో సందేహం విమానం కిటికీ అద్దాలు పగులుతాయా…? వాటిని ఏ విధంగా తయారు చేస్తారు…? అసలు మేటర్ ఏంటో చూద్దాం.
విమానంలో మూడు అద్దాలు ఉంటాయి. బయట ఉన్న అద్దం చాలా గట్టిది. విమానం గాలిలొ ఉంటే భూమి మీద నుండి 35000 అడుగుల దూరం ఉంటుంది. అంత ఎత్తులో మనం ఊపిరి పీల్చుకునే అవకాశం తక్కువ. అక్కడ ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిలో సాధారణ మనుషులు ఊపిరి లేక స్పృహ కోల్పోయి క్రమంగా 10–15 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోతారు. అంత ఎత్తులో కూడా మనం ఊపిరి పీల్చుకోవాలంటే మన విమానం లో ఊపిరి కి సరిపోయే ఒత్తిడి ఉండాలి.
అందుకోసం గానూ… విమానం లో ఎక్కువ ఒత్తిడి ఉండే వాతావరణం ఉండాల్సి ఉంటుంది. ఒక వేళ విమానం గాలిలొ ఉండగా అద్దం పగిలితే బయట ఉండే లో ప్రెజర్ కు విమానం లోని హై ప్రెజర్ మధ్య తేడాతో విమానంలో ఉన్న సామాన్లు బయటకు వెళ్ళిపోతాయి. 2018 సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో విండ్ షీల్డ్ పగిలిపోయి… ఆ పైలెట్ ప్రెజర్ కు విమానం నుంచి బయటకు కొట్టుకుపోయాడు. అయితే సీటు బెల్ట్ ఉండటంతో గాలిలో వేలాడుతూ విమానం తో పాటు కిందకు వచ్చాడు. అంతలోనే కో – పైలెట్ విమానాన్ని ఎమర్జెన్సి ల్యాండ్ చేసాడు.
ఇక సీట్ పక్కన ఉండే అద్దం అద్దం స్క్రాచ్ రేసిస్టేంట్ గ్లాస్. ఇది బలంగా కొట్టినా సరే పగిలే అవకాశం ఉండదు. ఈ రెండిటి మధ్యలో ఉన్న గ్లాస్ అక్రిలైక్ సొల్యూషన్ తో చేసిన బలమైన అద్దం. 3000 కేజీల బరువుని కూడా అడ్డుకునే అంత సామార్ధ్యం ఉంటుంది. ఒక బాక్సర్ ఎంత బలంగా గుద్దినా సరే బరువు 1300 కేజీలు దాటే అవకాశం ఉండదు.