సీఎం కేసీఆర్ మే 29వరకు లాక్ డౌన్ అని ప్రకటించేశారు. మే 17వరకు కేంద్రం విధించిన లాక్ డౌన్ అమలులో ఉంది. అయితే దేశంలో లాక్ డౌన్ అమలు తీరు, ఆర్థిక వ్యవస్థ, రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులపై ప్రధాని సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇది 5వ వీడియా కాన్ఫరెన్స్.
అయితే… మొదట్లో సీఎం కేసీఆర్ ప్రధాని నిర్ణయాలను అంగీకరిస్తూనే, కేంద్ర నిర్ణయాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కానీ క్రమేపి సీఎం కేసీఆర్ ప్రధాని, కేంద్రపై ఇటీవీల మీడియా సమావేశంలోనూ విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రం ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో అర్థం కావటం లేదని… ఇలా అయితే మంచిది కాదంటూ నేరుగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ మొదలుకాక ముందు నుండి ఇప్పటి వరకు కేంద్రం వద్ద తెలంగాణ ప్రతిపాదనలు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. వాటితో పాటు ఈ పరిస్థితుల్లో ఆదుకోవాలని కేసీఆర్ కోరుతున్నారు. ఆ అంశాలనే మరోసారి కేసీఆర్ ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది.
1. రాష్ట్రాల రుణ పరిమితి అంశం (ఎఫ్ఆర్బీఎం)ను 3 నుండి 6వరకు పెంచాలని, తద్వారా రాష్ట్రాలకు బయటి నుండి అయినా రుణం తీసుకునే అవకాశం పెరుగుతుందని కేసీఆర్ వాదన. ఇది ఎప్పటి నుండో కేసీఆర్ కేంద్రాన్ని కోరుతుండగా… ఇప్పుడున్న ఆర్థిక మందగమనంలో మరింత ఒత్తిడి తెస్తున్నారు.
2. రాష్ట్రాల నెలసరి వాయిదాలను వాయిదా వేసుకునేలా ఆర్బీఐతో చర్యలు
3. రాష్ట్రాలకు కరోనా నష్టం కింద ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు
4. చిన్న, మధ్య తరగతితో పాటు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకునేందుకు తక్షణ ప్రణాళిక, ఆర్థిక ప్రోత్సహాకాలు.