మన తెలుగు సినిమాలో యాక్షన్ కంటే కూడా కామెడి సినిమాలకే ఆదరణ ఎక్కువ. పాత సినిమాలు అయినా సరే టీవీ లో వస్తే మాత్రం మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాం. కామెడి సినిమాలు చేసే నటులకు, హీరోలకు మంచి ఆదరణ ఉండేది. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్, ఆ తర్వాత అల్లరి నరేష్ ఇలా చాలా మంది కామెడితో తమదైన ముద్ర వేసారు. సరే గాని మన తెలుగులో టాప్ 10 కామెడి సినిమాలు ఏంటో చూద్దాం.
చంటబ్బాయ్ : చిరంజీవి, సుత్తివేలు గారి కామెడి కోసం సినిమా ఎన్ని సార్లు అయినా చూడవచ్చు.
మామ గారు: ఈ సినిమాలో కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ కామెడి ఇప్పటికి కూడా సూపర్ హిట్.
చినరాయుడు: ఈ సినిమాలో కూడా కోటా, బాబు మోహన్ కామెడి కి జనాలు ఊగిపోయారు. ప్రతీ సీన్ కూడా అందంగా ఉంటుంది.
యావండి ఆవిడోచ్చింది: ఈ సినిమాలో హీరో హీరోయిన్ల కామెడి ఒక ఎత్తు అయితే కోటా, బాబు మోహన్ కామెడి మరో ఎత్తు.
ఏప్రిల్ ఒకటి విడుదల: పెంట మీద టీవీ తీసుకువచ్చి దుబాయ్ టీవీ అని అమ్మేసి ఆ టీవీ పేలిపోయే దృశ్యంలో జరిగిన కామెడి ఒక రేంజ్ లో ఉంటుంది. సినిమాలో ప్రతీ సీన్ కూడా అందంగానే ఉంటుంది.
ఆ ఒక్కటి అడక్కు : రాజేంద్ర ప్రసాద్ నట విశ్వరూపం చూపించిన సినిమా ఇది. ఈ సినిమాలో రావు గోపాల రావు చేసిన కామెడి మరో లెవెల్ కు వెళ్ళిపోయింది.
చిత్రం భలరే విచిత్రం: ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడి సూపర్ హిట్
నువ్వు నాకు నచ్చావ్: ఎన్ని వందల సార్లు చూసినా సరే బోర్ కొట్టని సినిమా ఇది. వెంకటేష్, సునీల్ కామెడి కోసం సినిమా ఇప్పటికీ చూస్తారు.
లేడీస్ టైలర్: ఈ సినిమాలో కాస్త పెద్ద వాళ్ళు చూసే కంటెంట్ ఉంటుంది గాని కామెడి మాత్రం బాగుంటుంది.
.బావ బావమరిది : సీల్క్ స్మితా కోసం పడిచచ్చే పాత్రలో కోట బాబు మోహన్ గారి కామెడీ మరో రేంజ్ లో ఉంటుంది.
జంబ లకిడి పంబ : ఈ వి వి గారి టాలెంట్ కు ఈ సినిమా నిదర్శనం. సినిమా ఎన్ని వందల సార్లు చూసినా కొత్తగానే ఉంటుంది