అమెజాన్, అంబానీల మధ్య చిక్కుకున్న బిగ్ బజార్ మాతృసంస్థ ఫ్యూచర్ రిటైల్ కంపెనీ నుండి హెరిటేజ్ ఫుడ్స్ వైదొలిగింది. సంస్థలో ఉన్న తన 3.65శాతం వాటాను విక్రయించగా 132కోట్లు వచ్చినట్లు హెరిటేజ్ ప్రకటించింది. ఈ మొత్తం సంస్థ నష్టాలు పూడ్చుకునేందుకే సరిపోతుందని తెలిపింది.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన పాల ఉత్పత్తుల సంస్థ హెరిటేజ్ ఫుడ్స్‌తో 2016 నవంబర్‌లో ఫ్యూచర్ రిటైల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఫ్యూచర్ రిటైల్ సంస్థలో హెరిటేజ్ ఫుడ్స్ కు 3.65 శాతం వాటా దక్కింది.
మరోవైపు జియో మార్ట్ తో దూసుకొస్తున్న దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్ ను 24,713కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, లాక్డౌన్ సమయంలో స్టోర్లు మూతపడి నాలుగు నెలల్లోనే 7వేల కోట్ల నష్టాన్ని చవి చూసినట్లు ఫ్యూచర్ గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది.