హీరో అడివి శేషు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో మంచి హిట్ లను అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మేజర్ సినిమా చేస్తున్నాడు. ముంబై ఉగ్రదాడుల్లో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక మహేష్ బాబు ఈ సినిమాను సోని పిక్చర్స్ వారితో కలిసి నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అడివి శేషు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని షేర్ చేశారు. తాను రెండు బాలీవుడ్ సినిమాలకు ఒకే చెప్పానని త్వరలోనే అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తానని అన్నారు. మరి అడివి శేషు ఎలాంటి అప్డేట్ ని ఇస్తారో చూడాలి.