తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అర్జున్. చివరిసారిగా నా పేరు సూర్యలో విలన్ పాత్రలో కనిపించిన అర్జున్… మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. రవితేజ నటించబోయే ఖిలాడీ సినిమాలో అర్జున్ విలన్ పాత్రకు ఎంపికయినట్లు తెలుస్తోంది.
రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం… ఇప్పటికే హైదరాబాద్ లో శరవేగంగా సాగుతుంది. అర్జున్ కు స్క్రిప్ట్ నచ్చటంతో ఈ మధ్యే సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతీ హీరోయిన్లుగా నటిస్తుండగా… దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2021 వేసవిలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఇక అర్జున్ కూడా కొన్ని కథలను సిద్ధం చేస్తున్నారని, త్వరలోనే నాగ చైతన్య హీరోగా సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.