నందమూరి హీరోల విషయంలో కొన్ని కామెంట్స్ మనం వింటూ ఉంటాం. ప్రధానంగా క్రమశిక్షణ అనే మాట ఎక్కువగా వినపడుతుంది. షూటింగ్ కి సమయానికి వస్తారని అంటారు. ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటారని షూటింగ్ సమయానికి గంట ముందు వస్తారని చెప్తారు. బాలకృష్ణ అయితే ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు.
ఆయన దర్శకులకు షూటింగ్ మొదలుపెట్టే ముందే చెప్పి కచ్చితంగా రావాలని అంటారట. అలా రాకపోతే మాత్రం సీరియస్ అవుతారని అంటారు. ఇలా ఒక దర్శకుడు విషయంలో ఆయన బాగా సీరియస్ అయ్యారు. ఆయన ఎవరో కాదు బాలకృష్ణతో వీరభద్ర అనే సినిమా చేసిన రవి కుమార్ పై. లక్ష్మీ నరసింహ సినిమా తర్వాత సింహ సినిమా వరకు ఆరేళ్ళ పాటు బాలకృష్ణకు మంచి హిట్ లేదు.
దీనితో బాలకృష్ణ హిట్ దర్శకులతో చర్చలు జరిపారు. అప్పుడే గోపిచంద్ హీరోగా చేసిన యజ్ఞం సినిమా సూపర్ హిట్ అయింది. దీనితో రవికుమార్ తో వీరభద్ర అనే సినిమా చేసారు ఆయన. ఆ డైరెక్టర్ తాగి వచ్చేవారు అని సమయానికి రాలేదు అని విమర్శలు రావడంతో బాలయ్య సీరియస్ అయ్యారని ఒక సందర్భంలో కొట్టారని టాక్ వచ్చింది. నిర్మాత అంబికా కృష్ణ కూడా ఇదే చెప్పారు అప్పుడు. తనకు చాలా నష్టం జరిగిందని కూడా అన్నారు. అయితే దీనిపై రవికుమార్ క్లారిటీ ఇచ్చారు.
Also Read: హీరోలను స్టార్లను చేసారు, కొడుకులను చేయలేకపోయారు…!