దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఛత్రపతి. వర్షం తర్వాత ప్రభాస్ కి కమర్షియల్ కిక్ ఇచ్చిన చిత్రం. ప్రభాస్ కి కమర్షియల్ గా ఓ మెట్టు ఎక్కించిన సినిమా.తెలుగులోనే కాకుండా పలుభాషల్లో రీమేక్ అయ్యింది.
ఇప్పుడు ఈ సినిమా టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్..హిందీలో రీమేక్ చేస్తున్నారు. మాస్ సినిమాలకు పెట్టింది పేరైనా వి.వి. వినాయక్.. ఛత్రపతి హిందీ రీమేక్కు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం ప్రకటన వచ్చినా…ఇంతవరకు ఈ చిత్రం విడుదల కాలేదు.
ఇంక థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుద్దన్న వార్తలు కూడా వచ్చాయి. అసలు ఎలాంటి అప్డేట్లు రాకపోవడంతో ఈ సినిమా ఉందన్న విషయమే చాలా మంది మర్చిపోయారు..!
ఇలాంటి సమయంలో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను సోమవారం ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ విడుదల తేదీని అనౌన్స్ చేశారు.
హిందీ రీమేక్కు కూడా ఒరిజినల్ టైటిల్ అయిన ఛత్రపతినే ఫిక్స్ చేశారు. వేసవి కానుకగా మే 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు.