కొందరు మన తెలుగులో ఫేమస్ అయిన హీరోలు ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదనే మాట వాస్తవం. అందులో ప్రేమిస్తే భరత్ కూడా ఒకరు. ఆయన బాయ్స్ సినిమాతో టాలీవుడ్ లో ఆయన పరిచయం అయ్యాడు. ఆ సినిమా తర్వాత పెద్దగా తెలుగులో నటించలేదు. బాయ్స్ తో పాటు ప్రేమిస్తే సినిమాకు అతనికి మంచి ఫాలోయింగ్ వచ్చింది.
Also Read:దేశాన్ని పాలించగలిగే సత్తా ఒక్క సీఎం కేసీఆర్ కే ఉంది..!
అలాగే యువ సేన సినిమాలో కూడా నటించాడు. ఆ సినిమా కూడా హిట్ అయింది. మళ్ళీ స్పైడర్ సినిమా వరకు తెలుగు వైపు చూడలేదు. అయితే తాను తెలుగు సినిమాల్లో ఎందుకు చేయడం లేదనే విషయాన్ని భరత్ తాజాగా బయట పెట్టాడు. బాయ్స్, ప్రేమిస్తే, యువసేన వంటి చిత్రాలలో తెలుగు మార్కెట్ ఏర్పడిన కానీ ఎందుకు మీరు తెలుగు సినిమాలు చేయలేదని మీడియా ఆయన్ను అడిగింది.
తెలుగులో నాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని… కానీ తెలుగులో మంచి మంచి కథలు రాకపోవడంతో, అదే టైంలో తమిళం, మలయాళం లో మంచి కథలు రావడంతో అక్కడ బిజీ అయిపోయాను అని చెప్పాడు. అంతే గాని తెలుగులో సినిమాలు చేయకూడదనే.. ఆలోచన నాకు లేదు అని స్పష్టం చేసాడు. మంచి మంచి ఆఫర్లు వస్తే కచ్చితంగా చేస్తాను అని చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ అంటే పడి చచ్చిపోయే అంత ఇష్టమని చెప్పాడు ఈ హీరో.