టాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా తమిళనాట ఆదిత్య వర్మ తో ఎంట్రీ ఇచ్చిన హీరో విక్రమ్ తనయుడు ధృవ్. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న ధృవ్ తన రెండవ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మురుగదాస్ శిష్యుడు దర్శకత్వంలో చేస్తున్నాడు రవికాంత్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం హీరోయిన్ విషయానికి వస్తేఒరు అడార్ లవ్ ఫేమ్ స ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికగా ఎంపికైందని సమాచారం.
కన్ను గీటుతో యూత్ హృదయాలను కొల్లగొట్టే మంచి క్రేజ్ తెచ్చుకుంది ప్రియ. ఇటీవల కాలంలో వరుస ఆఫర్లు దక్కించుకుని ప్రియా ధృవ్ సినిమాలో అవకాశం రావడంతో ఫుల్ హ్యాపీగా ఉందట. ఇదిలా ఉండగా నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కూడా ప్రియా ప్రకాష్ వారియర్ కు సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని సమాచారం.