విజయ్ దళపతి ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈసినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా భాగం కాబోతున్నారు. అయితే ధనుష్ ఈ సినిమాలో నటించడం లేదు. అతిధి పాత్ర కూడా చేయడం లేదు.
అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో ఓ పాట పాడబోతున్నాడు ధనుష్. విజయ్ వాయిస్ కు సరిపోయేలా తన గొంతులో మాడ్యులేషన్ కోసం ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడట ధనుష్. గతంలో ధనుష్ చాలా సార్లు పాట పాడారు. అవి మంచి విజయం సాధించాయి. మరి ఈ పాట ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.