ఇప్పటికే రాధేశ్యామ్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన యూవీ ప్రొడక్షన్స్ వచ్చే ఏడాది వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే సాహో డైరెక్టర్ సుజీత్ తో సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవటంతో సుజీత్ కొంతకాలంగా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు.
సుజీత్ ఇటీవలే హీరో గోపిచంద్ తో సమావేశమైనట్లు తెలుస్తోంది. గోపిచంద్, యూవీ క్రియేషన్స్ మధ్య మంచి సంబంధాలుండటంతో నెక్ట్స్ మూవీ ఖాయంగా కనిపిస్తుంది. గోపిచంద్ కు కథ సాగే విధానం వినిపించగా… ఫుల్ స్క్రిప్ట్ తో కలుద్దాం అని డిసైడ్ అయినట్లు ఫిలింనగర్ టాక్.
గోపిచంద్ ప్రస్తుతం సంపద్ నంది దర్శకత్వంలో సిటీమార్ సినిమా చేస్తున్నారు.