సినీ ఇండస్ట్రీలో రాణించాలి, స్టార్స్ గా ఎదగాలి అని ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు కలలుకంటూ ఉంటారు. అయితే ఆ అవకాశం కొంతమందికి మాత్రమే వస్తుంది. నిజానికి ఇండస్ట్రీ లో అవకాశం రావడం చాలా కష్టం. అయితే ఆ అవకాశం అదృష్టం కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. అలా అవకాశం వచ్చినప్పటికీ అనుకోని కారణాల వల్ల చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు కొంతమంది నటీనటులు. ఇంతకీ వారు ఎవరు ఎలా చనిపోయారు అనేది ఇప్పుడు చూద్దాం.
మొదటిగా ఉదయ్ కిరణ్. ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ ని అందుకున్నాడు ఉదయ్ కిరణ్. ఆ తరువాత వరుస హిట్ లు పడ్డాయి. స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే కొన్నాళ్ళకు ఫ్లాప్ లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఏమైందో తెలీదు… ఆత్మహత్య చేసుకున్నాడు.
అలాగే ప్రేమికుల రోజు సినిమా హీరో కునాల్. తన నటనతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న కునాల్ చిన్నవయసులోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక మరో హీరోయిన్ అష్టాచమ్మా భార్గవి. అష్టా చమ్మా సినిమాలో నాని చెల్లెలుగా నటించిన భార్గవి తన ప్రేమను ఇంట్లో ఒప్పుకోవడం లేదనే కారణంతో ఆత్మహత్య చేసుకుంది.
ఆర్తి అగర్వాల్, టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆర్తి అగర్వాల్ ఒకనొక సమయంలో విపరీతంగా బరువు పెరిగింది. బరువు తగ్గేందుకు సర్జరీ చేసుకుంది. ఆ సర్జరీ వికటించి మృతి చెందింది ఆర్తి అగర్వాల్.
మరో నటుడు విజయసాయి. అమ్మాయిలు అబ్బాయిలు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన విజయసాయి చాలా చిత్రాలలో కమెడియన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ కుటుంబ సమస్యల కారణంగా చిన్నవయసులోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రత్యూష… ప్రత్యూష గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చేసింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా చేసింది. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుంది.
సౌందర్య, ఒక్కపుడు స్టార్ హీరోయిన్. టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అందరి సరసన కూడా నటించింది. ఆ తరువాత హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించింది.
ALSO READ : సీనియర్ నటుడు నరేష్ ఎందుకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది ? మొదటి భార్య ఎవరంటే ?
మరో హీరోయిన్ దివ్యభారతి, విక్టరీ వెంకటేష్ నటించిన బొబ్బిలి రాజా సినిమా లో హీరోయిన్ గా నటించిన దివ్యభారతి ఒక్కసారి గా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది.
పునీత్ రాజ్ కుమార్, కన్నడ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ చిన్నవయసులోనే జిమ్ చేస్తూ గుండెపోటుతో మరణించారు. ఇప్పటికీ ఆయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ALSO READ : జయం సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు చాలా మారిపోయిందిగా ! హీరోయిన్ కంటే..
ఆఖరిగా యశో సాగర్, ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సాగర్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
Advertisements