హీరోలు నిర్మాతలు, డైరెక్టర్లుగా మారిన సంగతి చూసి ఉంటాం కానీ.. మ్యూజిక్ డైరెక్టర్‌గా మారడం మాత్రం అరుదు అనే చెప్పాలి. కోలివుడ్ యంగ్ హీరో జై ఆ రేర్ ఫిట్‌ను ట్రై చేశాడు. జై హీరోగా సుశీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీలో హీరోగానే కాదు మ్యూజిక్ డైరెక్టర్‌గానూ ట్రై చేశాడు.
గతంలో జైకి సంగీంలో కొంత ప్రవేశముందట. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో జై మ్యూజిక్ కూడా నేర్చుకున్నాడట. అలాగే దేవా, శ్రీకాంత్ దేవా, సాబేష్ మురళి కుటుంబంతో జైకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయట. అవన్నీ కలిసి ఈ హీరోన సంగీత సారథ్యం వహించేందుకు దారి తీసాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని చిత్ర యూనిట్ చెప్తోంది.