కార్తికేయ గుమ్మకొండ, అజిత్ నటించిన వలిమై చిత్రం ఫిబ్రవరి 24న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషలలో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కార్తికేయ.
కరోనా మహమ్మారి కారణంగా సినిమా తీయడంలో భారీ సవాళ్లు ఉన్నప్పటికీ, టీమ్ వాటన్నింటినీ ఓర్పు, అంకితభావంతో అధిగమించిందన్నారు. అజిత్ సార్ ఒక మానవ రత్నం అని టాప్ స్టార్ అయినప్పటికీ, అతను వినయంగా, సాదాసీదాగా ఉంటాడని అన్నారు. షూటింగ్ లో అతని నుంచి నేను చాలా నేర్చుకున్నానని అన్నారు.
ఛేజింగ్ సన్నివేశంలో గాయపడిన తర్వాత కూడా అజిత్ పని కొనసాగించాడని అది అతని చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు కార్తికేయ.
ఇక బేవ్యూ ప్రాజెక్ట్స్ , జీ స్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు.