యంగ్ హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో శ్రీ సరిపల్లి ర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం రాజా విక్రమార్క. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్ఐఏ ఏజెంట్ గా కార్తికేయ కనిపించనున్నారు. అలాగే సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తన్యా రవిచంద్రన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో సుధాకర్ కోమాకుల కూడా నటిస్తున్నారు. అలాగే ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా… ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. రాజా గారు బయటకొస్తే అంటూ సాగిన ఈ సాంగ్ సినిమా పై ఆసక్తిని పెంచుతుంది.