ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న అజయ్ ఇప్పటివరకు రెండో సినిమాను పట్టాలెక్కించలేదు. కానీ ఆ సినిమాలో హీరో, హీరోయిన్ మాత్రం చెరో నాలుగేసి సినిమాలు చేసేశారు. మహాసముద్రం అనే కథను సిద్ధం చేసుకున్న అజయ్ రవితేజ, నాగచైతన్య ల దగ్గరకు తిరిగి ఎట్టకేలకు శర్వానంద్ ను ఒప్పించాడు.
కానీ కరోనా కారణంగా షూటింగ్ లు నిలిచిపోవటంతో సినిమా పట్టాలెక్కలేదు. అన్నీ కుదిరితే అక్టోబర్, నవంబర్ లో ఈ సినిమా పట్టాలెక్కించాలని దర్శకుడు భావిస్తున్నాడట. అయితే తాజాగా సమాచారం ప్రకారం మొదటి సినిమాలో హీరోయిన్ ను నెగటివ్ షేడ్స్ లో చూపించిన దర్శకుడు అజయ్ భూపతి మహాసముద్రంలో ఏకంగా హీరో ను కాస్త నెగటివ్ గా చూపించబోతున్నాడట. ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం సినిమా చేస్తున్నాడు.