గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న మంచు మనోజ్ తాజాగా ట్వీట్టర్ వేదికగా ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. మంచు మనోజ్ భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ.. గత కొంతకాలంగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.
అందుకు తగ్గట్లుగానే వారిద్దరూ పలు మార్లు జంటగా బయట కనిపించారు. దానికి తోడు ప్రస్తుతం మంచు మనోజ్ ట్వీట్ చేయడంతో అది కన్ఫామ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
‘లైఫ్ లో నెక్ట్స్ ఫేజ్ లోకి అడుగు పెట్టబోతున్నా.. చాలా రోజులుగా నా మనసులో దాచుకుంటూ వస్తోన్న ఓ స్పెషల్ న్యూస్ ను జనవరి 20న అందరితో పంచుకోనున్నా’.. అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ తన ఏ ఉద్దేశంతో పెట్టాడో తెలియదు గానీ.. నెటిజన్లు మాత్రం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కొంతమంది ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని, మరికొందరు మనోజ్ సినిమా రీఎంట్రీ గురించి అంటూ భావిస్తున్నారు. మొత్తానికి మనోజ్ చేసిన ఈ ట్వీట్ పై ఆయన స్పందిస్తేనే అసలు విషయం ఏంటన్నది బయటపడనుంది.