శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం హీరో. ఈ సినిమా లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన సాంగ్స్, లుక్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
అయితే రిలీజ్ డేట్ దగ్గరపడ్డ నేపథ్యంలో మేకర్స్ మరో కొత్త పాటను రిలీజ్ చేశారు. బుర్రపాడవుతున్నదే అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో అశోక్ మాస్ స్టెప్పులు, నిధి అగర్వాల్ అందాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సాంగ్ కు గిబ్రాన్ సంగీతం అందించగా భాస్కర్ భట్ల లిరిక్స్ రాశారు. అనురాహ్ కులకర్ణి , మంగ్లీ పాడారు.