ఆర్ ఆర్ ఆర్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. సంక్రాంతి బరిలో పోటీకి సిద్ధం అవుతున్నాయి. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరో మూవీ కూడా లైన్ లో ఉంది.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ర్యాప్ సాంగ్ ని విడుదల చేశారు.
ఊరూ వాడా చూడు ఈడ.. అన్నకేమో హల్ చల్ ఉంది.. జిల్లా మొత్తం ఊగుతోంది.. గల్లా ఎత్తి స్టెప్పులేంది అంటూ సాగిన ఈ పాటకు జిబ్రాన్ సంగీతం అందించారు.