యంగ్ హీరో నితిన్ ఇప్పటికే రంగ్ దే కోసం దుబాయ్ చేరుకున్నారు. ఇటలీ లో షూట్ చేయాల్సిన షాట్స్… కరోనా కారణంగా దుబాయ్ కు మారాయి. మరో యంగ్ హీరో నాగశౌర్య సైతం ఇప్పుడు దుబాయ్ వెళ్లనున్నాడు.
అయితే, శౌర్య వెళ్లేది రంగ్ దే కోసం కాదు…. తన తదుపరి చిత్రం వరుడు కావలెను మూవీ కోసం. త్వరలోనే నాగశౌర్య, ఆయన టీం అంతా దుబాయ్ వెళ్లనున్నారు. లక్ష్మి సౌజన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ రెండు సినిమాలు సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీయే నిర్మిస్తుండటం మరో విశేషం.