న్యాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా వి. నాని 25 వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అప్పుడప్పుడే థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం తో ఓటిటి వేదికగా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో నానీతో పాటు సుధీర్ బాబు ,నివేద థామస్ ,అతిధి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను నెలకొల్పింది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని విషయాలను వెల్లడించారు నాని. ముందుగా సినిమా మార్చిలో విడుదల చేయాలనుకున్నాం కానీ వీలుపడలేదు. థియేటర్స్ కూడా ఇప్పుడు ఓపెన్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు. అందుకే ఓటిటి లో విడుదల చేస్తున్నాం. ఎంతైనా థియేటర్స్ ఎక్స్పీరియన్స్ వేరు. మార్పు కోరుకుంటున్నపుడు ఎవరో ఒకరు దానిని మొదలు పెట్టాలి. ఆ మార్పును మేము ముందుకు తీసుకువస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు నాని.