తాజాగా తెరకెక్కుతున్న నేచురల్ స్టార్ నాని చిత్రం ‘వీ’. ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ మూవీలో నాని రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. విలన్ పాత్రలో నటిస్తారని తెలుస్తుండగా… మరో పాత్ర ఏంటన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది. అయితే ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తుండటంతో షూటింగ్ లో వేగం పెంచారు.
కొత్త గెటప్ లో కనిపించిన నాని పిక్ ఒకటి తాజాగా కెమెరా కంటికి చిక్కింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో నాని కెమెరా కంటికి చిక్కడంతో… అతని సినిమాలోని సస్పెన్స్ గెటప్ లోని చిత్రమిదేనని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇందులో నాని తన స్టైల్ కు భిన్నంగా కనిపించాడు. షార్ట్ హెయిర్ స్టైల్ తో లవర్ బోయ్ లుక్ లో ఉన్నాడు. కాస్తా బొద్దుగా కూడా మారినట్లు కనబడుతోంది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన నాని ఫోటో సినిమాకు సంభదించినదేనా లేక ఎక్కడికైనా వెళ్తున్న సమయంలో తీసిన ఫోటోనా అన్నది తెలియాల్సి ఉన్నది.