హ్యపీడేస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి… ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో నిఖిల్. ఎక్కడికిపోతావు చిన్నవాడ లాంటి హిట్‌తో ఇండస్ట్రీలో నిలబడ్డాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా డైరెక్టర్‌తో కలిసి త్వరలో మరో సినిమా తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు నిఖిల్.
తను ఇటీవలే రానాతో కలిసి నటించాల్సిన మల్టీస్టారర్ సినిమా మిస్ చేసుకున్నానని, కానీ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలన్నది తన కల అని కామెంట్ చేశారు. అవసరమయితే… పవన్‌తో సినిమా తేడా వస్తే ప్రొడ్యూసర్ లాస్‌ను నేను భరిస్తా కానీ పవన్‌తో సినిమా మిస్ చేసుకోనని స్పష్టం చేశారు.
ప్రస్తుతం నిఖిల్ నటించిన అర్జున్ సురవం సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తోంది.
రిలీజ్‌కు రెడీగా ఉన్న అర్జున్ సురవరం సినిమా తర్వాత తన పెళ్లిపై నిర్ణయం ప్రకటిస్తానంటూ ప్రకటించారు నిఖిల్.